ఈ నెల 25న ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడితో.. జో బైడెన్ భేటీ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ నెల 25న ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అప్రఫ్ ఘనీతో పాటు ఆ దేశ సిఈఓ డా.అబ్దుల్లాను వైట్‍హౌస్‍లో కలుసుకోనున్నారు. ఆప్ఘన్ నుంచి అమెరికా సేనల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో ఉభయ దేశాల మధ్య స్నేహ సంబంధాలపై వీరు ప్రధానంగా చర్చలు జరుపుతాయని వైట్‍హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్‍సాకి తెలిపారు. ఘనీతో పాటు హై కౌన్సిల్ ఫర్ నేషనల్ రికాన్సిలియేషన్ చైర్మన్ ఈ భేటీపై బైడెన్ ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.