మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధం : మోదీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డెమోక్రాట్లు జో బైడెన్, కమలా హ్యారిస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అద్బుతమైన విజయం సాధించిన బైడెన్‌కు అభినందనలు. మీరు (బైడెన్) అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. మళ్లీ ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని ఆయన ట్వీట్ చేశారు. అలాగే అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్‌కూ మోదీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.






