ఇరాన్ తో అణుఒప్పందంలో తిరిగి చేరొద్దు
ఇరాన్‌తో అణు ఒప్పందంలో తిరిగి చేరాలన్న జో బైడెన్ ప్రణాళికను ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ వ్యతిరేకించారు. ఆ ఒప్పందంలో మళ్లీ భాగస్వామిగా మారితే అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ఇరాన్ విశ్వసనీయ భాగస్వామి కాదు. ఆ దేశం యురేనియం నిల్వలను పెంచుకుంటూనే ఉంది. ఇజ్రాయెల్, అమెరికాలను నాశనం చేయాలన్న పిలుపులనూ కొనసాగిస్తోంది అని ట్విటర్లో హేలీ వ్యాఖ్యానించారు. ఒబామా ప్రభుత్వ హయాంలో ఇరాన్‌తో అణు ఒప్పందంపై అమెరికా సంతకం చేయగా 2018లో ట్రంప్ ప్రభుత్వం దాన్నుంచి ఏకపక్షంగా వైదొలిగిన సంగతి గమనార్హం.






