వైట్ హౌస్ వీడాక విడాకులు ?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పరాభవం వెంటాడుతున్న సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత జీవితంలో అంతకంటే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఆయనకు విడాకులు ఇవ్వాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ వైట్ హౌస్‌ని విడిచిపెట్టిన వెంటనే మెలానియా కూడా ఆయనకి శాశ్వతంగా గుడ్ బై కొట్టేస్తారని తెలుస్తోంది. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఎప్పుడెప్పుడు ముగింపు చెబుదామా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతున్నట్టుగా ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా చెప్పినట్టుగా తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి ఎప్పుడు వైదొలుగుతారా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతోంది. ఆయన పదవి నుంచి దిగిపోగానే విడాకులు ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. వారిద్దరి మధ్య భార్యభర్తల బంధం లేదు. అవసరం కోసం ఇద్దరు అలా కాలం గడిపేస్తున్నారు అని ఒమరోసా తెలిపారు.






