సంపన్నుల ముక్కుపిండుతాం : కమలాహ్యారిస్
అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలాహ్యారిస్ దేశంలోని దిగువ, మధ్య ఆదాయ వర్గాల ప్రజలకు శుభవార్త చెప్పారు. 4 లక్షల డాలర్లలోపు వార్షిక ఆదాయం ఉన్నవారిపై కొత్తగా పన్నుల భారం మోపబోమని హామీ ఇచ్చారు. అదే సమయంలో ధనికులు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఎక్కువ పన్నులు చెల్లించాల్సి ఉంటుందని సృష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. బుధవారం ఉదయం తన భర్త డగ్లస్ ఎమ్హాఫ్తో కలిసి వెళ్తూ నగరంలో ఓ వృద్ధుడు నడిపిస్తున్న చిన్న బేకరీషాపు వద్ద ఆమె కొద్దిసేపు ఆగారు. అనంతరం కాబోయే దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వ పన్నుల విధానం గురించి పలు ట్వీట్లు చేశారు. స్వయం ఉపాధి కల్పించే చిన్న చిన్న షాపులే అమెరికాను స్వయం సమృద్ధం చేస్తాయని అన్నారు.






