నువ్వూ అధ్యక్షురాలివి కావొచ్చు!
డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమలా హారిస్ తన మేన కోడలితో ముచ్చటించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. వారి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ విన్న ప్రతీ ఒక్కరూ ఆమెలో స్ఫూర్తి నింపుతున్నారు. ఆమెకు ఉన్న అతిపెద్ద లక్ష్యాన్ని చేరుకోవచ్చని చిన్నారిలో నెటిజన్లు స్ఫూర్తి నింపారు. నాలుగేళ్ల మేనకోడలు అమరా అజాగును కమలా హారిస్ తన ఒళ్లో కూర్చోబెట్టుకుని ముచ్చటించారు. తనకు అధ్యక్షురాలు కావాలనుందని అమరా కోరగా, కమలా స్పందిస్తూ నువ్వూ అధ్యక్షురాలివి కావొచ్చని, అందుకు నీను 35 ఏళ్ల నిండాలని తెలిపింది. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు కష్టపడాలని చిన్నారికి సూచించారు. ఈ వీడియోను 4.5 లక్షల మంది వీక్షించారు. చిన్నారిలో స్ఫూర్తి నింపుతున్న హారిస్‌ను ప్రశంసిస్తూ వేల మంది నెటిజన్లు కామెంట్లు చేశారు.






