అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణం స్వీకారం
అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ స్థానానికి చేరుకున్న మొదటి నల్లజాతి మహిళ, అదేవిధంగా తొలి భారతీయ సంతతికి చెందిన మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. క్యాపిటల్ హిల్ వెస్ట్ ఫ్రంట్‌లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కమలా హారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
కమలా హారిస్ తల్లి శ్యామాల గోపాలన్ భారతీయురాలు, తండ్రి డోనాల్డ్ హ్యారిస్ జమైకాకు చెందినవారు. 1964 అక్టోబర్ 20న జన్యించిన కమలా హారిస్.. ఓక్‌ల్యాండ్‌లోని వెస్ట్‌మౌంట్ హైస్కూల్ నుంచి హైస్కూల్ విద్య, యూసీ హేస్టింగ్స్ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్యను, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అభ్యసించారు. కమలా హారిస్ న్యాయవాదిగా సుదీర్ఘ వృత్తి జీవితాన్ని కలిగి ఉన్నారు.






