అగ్రరాజ్యంలో సత్తా చాటిన కమలాహారీస్
అగ్రరాజ్యం అమెరికాలో లేడీ ఒబామాగా పేరు తెచ్చుకున్న కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. తొలి నల్లజాతి అమెరికన్, తొలి ఇండో-అమెరికన్, తొలి ఆసియా-అమెరికన్, తొలి దక్షిణాసియా మహిళగా కూడా కమల రికార్డు సృష్టించారు. కమలా హారిస్ తండ్రి జమైకన్.. కాగా తల్లి భారతీయురాలు. ఇద్దరూ వలస వచ్చినవారే. హారిస్ 2014 లో ప్రముఖ న్యాయవాది అయిన డగ్లస్ ఎమ్హాఫ్ను వివాహమాడారు. హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ క్యాన్సర్‌తో 2009 లో మరణించారు.
కమల జీవితం మొదటి నుంచి ఇబ్బందుల్లోనే గడిచింది. 1964, అక్టోబర్ 20న కమల ఓక్లాండ్లో జన్మించారు. తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు. తండ్రి డొనాల్డ్ జేహ్యారిస్ జమైకాకు వ్యక్తి. వీరికి కమల, మాయ జన్మించారు. కమల ఏడో ఏటనే తల్లిదండ్రులు విడిపోయారు. వారాంతాల్లో తండ్రి హ్యారిస్ ఇంటికి కమల వెళ్లేవారు. ఒకరోజు ఆడుకోవడానికి పొరుగింటి పిల్లల దగ్గరకు కమల వెళ్లారు. అయితే నల్లజాతీయులన్న కారణంతో ఆ పిల్లలు కమలను దూరం పెట్టారు. జరిగిన సంగతిని తల్లికి చెప్పింది. నల్లజాతీయులపై కొనసాగుతున్న వివక్షను శ్యామల.. కమలకు వివరించారు. దీంతో వయసుతో పాటే మహిళా సాధికారత, జాతి వివక్షను రూపుమాపడం కోసం పాటుపడే లక్షణాలను ఆమె క్రమంగా అలవర్చుకున్నారు.
హోవర్డ్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ, హెస్టింగ్స్ కాలేజీ ఆఫ్ లాలో కమల న్యాయవిద్యను అభ్యసించారు. 2002లో శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా ఎన్నికవడం కమల జీవితాన్ని మలుపుతిప్పింది. నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడటంలో, మాదక ద్రవ్యాలను మానుకోలేక జీవితాల్ని బలిపెట్టుకుం టున్న యువతకు కొత్త జీవితాన్ని చూపడంలో ఆమె ఎంతగానో కృషి చేశారు. దేశ ప్రగతి రథానికి విద్యార్థులే చోదకులుగా నమ్మే కమల.. పిల్లలు పాఠశాలలకు వెళ్లకపోతే తల్లిదండ్రులకు శిక్ష విధించాలని సూచించడమే గాకుండా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేశారు. ఆమె ప్రసంగాలు, సామాజిక కార్యక్రమాలు అనతి కాలంలోనే ప్రజల అభిమానాల్ని చూరగొన్నాయి. ఈ క్రమంలో ఆమె వాగ్ధాటి, ఉద్వేగపూరిత ప్రసంగాన్ని చూసిన అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎంతో ముగ్ధులయ్యారు. అలా క్రమంగా డెమోక్రటిక్ పార్టీలో చేరిన ఆమె.. ‘లేడీ ఒబామా’గా పేరుగాంచారు. 2016లో డెమోక్రటిక్ పార్టీ తరఫున సెనేట్‌కు ఎన్నియ్యారు. అమెరికన్ సమాజంలో శతాబ్దాలుగా వేళ్లూనుకున్న రుగ్మతలను పెకిలించాలనుకున్న కమల తొలుత అధ్యక్ష పదవిపైనే దృష్టిపెట్టారు. క్రాటిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ గతేడాది ప్రకటించారు. నిధుల సేకరణలో వెనుకబడటంతో రేసు నుంచి తప్పుకున్నారు. బైడెన్ ఉపాధ్యక్షపదవికి ఆమెను ఎంచుకోవడం, చివరకు బైడెన్ విజేతగా నిలవడంతో కమలాహారీస్ అమెరికాకు ఉపాధ్యక్షురాలయ్యారు.
అమ్మ ఊహించలేదు…
అగ్రరాజ్యం అమెరికాకు ఉపాధ్యక్షురాలుగా కమలా హారిస్ ఎన్నికయ్యారు. ఇలా ఇంత పెద్ద దేశానికి తన కూతురు ఉపాధ్యక్షురాలు అవుతుందని భారత్ నుంచి బయల్దేరి వచ్చినప్పుడు మా అమ్మ అస్సలు ఊహించి ఉండదని కమలాదేవి హారిస్ చెప్పారు. ‘‘ఈ రోజు ఇక్కడ నా ఉనికికి గొప్ప బాధ్యత వహించిన మహిళకు (శ్యామలా గోపాలన్) నా క•తజ్ఞతలు. అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ సొంత నగరమైన డెలావేర్ విల్మింగ్టన్లో జరిగిన బహిరంగ ర్యాలీలో కమలా హారిస్ తొలి ప్రసంగంలో తన తల్లిగురించి ప్రస్తావించారు. డెమోక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయిన అనంతరం కమలా హారిస్ అప్పుడు చేసిన ప్రసంగంలో తన భారతీయ మూలాలను ప్రస్తావించారు. తన తల్లి చెన్నైలో జన్మించిందని గుర్తుచేసుకు న్నారు. తన భారతీయ వారసత్వాన్ని ప్రస్తావించిన కమలాదేవి.. నా మేనమామలు, నా అత్తలు.. అందరూ గుర్తుకొస్తున్నారు అంటూ కొంత తమిళయాసను కలిపి మాట్లాడారు. 19 సంవత్సరాల వయస్సులో భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చిన ప్పుడు.. ఆమె ఈ క్షణాలు ఇలా ఉంటాయని ఊహించి ఉండక పోవచ్చు. కానీ అమెరికాను ఆమె చాలా లోతుగా విశ్వసించారు, ఇక్కడ ఇలాంటి క్షణాలు సాధ్యమే. నల్లజాతి మహిళలు, ఆసియా, తెలుపు, లాటినా, స్థానిక అమెరికన్ మహిళలు.. అమెరికన్ దేశ చరిత్రలో దీనికి మార్గం సుగమం చేశారు అని ఆమె ఉత్సాహంతో చెప్పారు. కమలా హారిస్ విజయాన్ని కోరుతూ చెన్నై సమీపంలోని తన తాతామామల గ్రామమైన తులసేంద్రపురంలో అక్కడి ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆమె ఉపాధ్యక్ష పదవిని స్వీకరిస్తున్నట్లు తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున సంబరాలను చేసుకున్నారు.






