ఇజ్రాయెల్ కు బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్
గాజాపై భూదాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గాజా స్ట్రిప్ ను ఆక్రమించొద్దంటూ ఆ దేశ (ఇజ్రాయెల్) అధ్యక్షుడిని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడుల కారణంగా ఇప్పటి వరకు మొత్తం 1400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అందులో 30 మంది దాకా అమెరికన్ పౌరులు ఉన్నారు. ఈ క్రమంలో బైడెన్ మాట్లాడుతూ గాజా స్ట్రిప్‌ను పూర్తి స్థాయిలో ఆక్రమించుకోవడాన్ని తాము సమర్థించబోమని స్పష్టం చేశారు. గాజాను ఆక్రమించడం చాలా పెద్ద తప్పే అవుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్ మళ్లీ ఆక్రమించుకుంటే అది పెద్ద తప్పే అవుతుంది. ఇజ్రాయెల్ యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా ముందుకు వెళ్లదని నేను విశ్వసిస్తున్నాను అని అన్నారు.






