అమెరికా బరిలో వృద్ధ సింహాలేనా?
అయోవా రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడూ న్యూ హ్యాంప్‌షైర్ రాష్ట్ర ప్రైమరీలోనూ మెజారిటీతో గెలవాలని ఆక్షిస్తున్నారు. ట్రంప్ వరుసగా రెండు రాష్ట్రాల్లో గెలిస్తే దేశాధ్యక్ష ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ ఆయన్నే వరించవచ్చు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ( డెమోక్రటిక్ పార్టీ)తో ట్రంప్ తలపడటం ఖాయమవుతుంది. అధ్యక్ష పదవికి బైడెన్ (81), ట్రంప్ (77) వంటి వృద్ధ సింహాలు తప్ప మరో గతి లేదా అని మెజారిటీ అమెరికన్ ఓటర్లు మధనపడుతున్నారు.






