మెక్సికో విషయంలో..జో బైడెన్ కు కొత్త తలనొప్పి
మెక్సికో నుంచి అమెరికాలోకి రావడానికి మెక్సికో వాసులకు తలుపులు తెరువడంతో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ట్రంప్ నిర్ణయాలు పక్కనపెట్టిన బైడెన్ మెక్సికో వాసులను అమెరికాలోకి అనుమతించడంతో వేలాది మంది అందుకు సిద్ధమయ్యారు. తొలి విడుతగా 25 వేల మందికి బైడెన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయినా ఇంకా వేలాది మంది అమెరికాకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు. అమెరికాలోకి వచ్చేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ మధ్య అమెరికా దేశాల నుంచి పారిపోయిన ప్రజల పిల్లలు నిరంతరం అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. గత రెండు వారాల్లో 3,250 మందికి పైగా పిల్లలను పట్టుకుని నిర్బంధ కేంద్రాలకు తరలించారు. జనవరి నెల నుంచి మెక్సికో సరిహద్దు మీదుగా అమెరికాలో ప్రవేశించడానికి 78 వేల మంది వలసదారులు ప్రయత్నించారు. ఈ సంఖ్య గత సంవత్సరం ఇదే కాలానికి రెండు రెట్లుగా ఉండేది.






