వ్యాక్సిన్ ఫై … జో బైడెన్ కీలక నిర్ణయం
అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జో బైడెన్, అతని భార్య జిల్ వ్యాక్సిన్ను స్వీకరించేందుకు ముందుకు వచ్చారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ తొలి మోతాదును బహిరంగంగా పొందనున్నారని బైడెన్ ప్రెసె సెక్రటరీ జెన్ సాకి ప్రకటించారు. ఇప్పటికే చాలాసార్లు బైడెన్ చెప్పినట్లుగా, వ్యాక్సిన్ సురక్షితమైందని ప్రజలకు సృష్టమైన సందేశాన్ని పంపడకోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పెన్స్ స్వీకరించినట్టుగా బహిరంగంగా టీకా తీసుకుంటారని, అలాగే డెలావేర్ కేంద్రంలో టీకాను తీసుకోనున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలపనున్నారని ఆమె వెల్లడించారు.
అలాగే ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్, ఆమె భర్త కూడా వచ్చే వారం టీకాను స్వీకరిస్తారు. కరోనా టీకా తొలి మోతాదును స్వీకరించనున్నామని ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్య కారెన్, హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ప్రకటించిన అనంతరం బైడెన్ నిర్ణయం రావడం విశేషం. మరో వైపు బైడెన్ సీనియర్ సలహాదారుడు, కాంగ్రెస్ సభ్యుడు సెడ్రిక్ రిచ్మండ్కు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఇప్పటివరకు కరోనా వల్ల 3,14,00 మంది మరణిచారు.






