ప్రజాస్వామ్యానికి ట్రంప్ పెద్ద ముప్పు : జో బైడెన్
డొనాల్డ్ ట్రంప్, ఆయన సహచరులు ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఆయన ట్రంప్‌పై నేరుగా చేసిన అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఇవే. దేశ ప్రధాన విలువలను బలోపేతం చేయడం కంటే, వ్యక్తిగత శక్తిని పెంచుకోవడంపైనే ట్రంప్‌నకు ఆసక్తి ఉందని, ఇందుకు రిపబ్లికన్లు కూడా సపహకరిస్తున్నారని బైడెన్ వ్యాఖ్యానించారు. అరిజోనాలో తన సహచరుడు దివంగత జాన్ మెకైన్ స్మారకార్థం చేపట్టిన లైబ్రరీ నిర్మాణ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడారు. దేశానికి ముప్పు పొంచి ఉందని చెబుతూనే మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే ప్రచార థీమ్‌ను ఆయన పునరుద్ఘాటించారు. గత మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు ఓడిపోవడంతో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఈ ఆలోచనను మరోసారి ముందుకు తెచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికా ఏదో ప్రమాదం పొంచి ఉంది అని బైడెన్ అనుమానం వ్యక్తం చేశారు.






