డొనాల్డ్ ట్రంప్‌ను ఓడిస్తా … కమల హారిస్
డెమోక్రాట్ల మద్దతుతో అమెరికా అధ్యక్ష బరిలో నిలుస్తానని, దేశాన్ని ఐక్యం చేసి ట్రంప్‌ను ఓడిస్తానని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వానికి తన పేరును అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఎన్నికల బరి నుంచి బైడెన్ వైదొలగి 59ఏళ్ల హరిస్‌కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. దీంతో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడే అవకాశమున్న నేతల్లో ఆమె ముందు వరుసలో ఉన్నారు. ఆమె పేరును ఖరారైతే తొలి ఆఫ్రో అమెరికన్, తొలి ఆసియన్ అమెరికన్ నాయకురాలిగా రికార్డు స్పష్టిస్తారు.
వచ్చే నెలలో జరిగే పార్టీ సమావేశంలో అధికారికంగా అభ్యర్థి ఖరారవుతారు. ఆమెతో పాటు మరి కొంత మంది అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు. రానున్న రోజుల్లో పారదర్శకంగా, పార్టీ నిబంధనల ప్రకారం అధ్యక్ష అభ్యర్థి ఎంపిక ప్రక్రియను చేపడతామని డెమోక్రటిక్ పార్టీ జాతీయ కమిటీ చైర్మన్ జైమీ హారిసన్ తెలిపారు. ట్రంప్ ఓడిరచగలిగే సమర్థులైన నేతలను ఎన్నుకుంటామని వెల్లడించారు.






