ట్రంప్ వస్తే సంపన్నులకే మేలు : హారిస్
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే మధ్య తరగతిని బలహీనం చేసి సంపన్నులకు పన్నులు తగ్గిస్తారని డెమోక్రటిక్ పార్టీ నేత, భారత సంతతి అమెరికన్ కమలా హారిస్ హెచ్చరించారు. దేశాన్ని ఆయన వెనక్కి తీసుకెళ్తారని విమర్శించారు. పిల్లలెవరూ పేదరికంలో పెరగకూడదని భావిస్తున్నాని, వారిని సరిగా పెంచడానికి వేతనంతో కూడిన సెలవులను ఇస్తామని చెప్పారు. ఆమె తన ప్రచార సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. అందరికీ అందుబాటులో వైద్య సౌకర్యాలు ఉండేలా చూస్తానని తెలిపారు. ప్రతి కార్మికుడికి గౌరవప్రదమైన వేతనం అందిస్తాం. ప్రతి సీనియర్ సిటిజన్ గౌరవంగా పదవీ విరమణ చేయడానికి అవకాశం కల్పిస్తాం. మధ్య తరగతి గట్టిగా ఉండే అమెరికా గట్టిగా ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటా అని పేర్కొన్నారు.






