ప్రేమలేఖ తో విరాళాలు సేకరించిన ట్రంప్
అమెరికా అధికార పీఠాన్ని మరోసారి దక్కించుకోవాలని కలలు కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం వినూత్న పద్దతుల్లో విరాళాలు సేకరిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మెలానియాకు రాసిన లేఖను ట్రంప్ తన విరాళాలు సేకరించే వెబ్సైట్లో పోస్టు చేశారు. ఇది నా భార్యకు రాసిన వాలెంటైన్స్ డే లేఖ. మీరు నాపై మీ ప్రేమను కురిపించండి అంటూ విరాళాలు కోరారు. డియర్ మెలానియా నేను నిన్న ఎంతగానో ప్రేమిస్తున్నా. నాపై నేరా భియోగాలు వచ్చినా, నన్ను అరెస్టు చేసినా ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా నువ్వు నన్ను వదిలిపెట్టలేదు. కష్ట సమయంలో నాకు అండగా నిలిచావు. నీ మార్గదర్శకత్వం లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నువ్వే నా ప్రపంచం ప్రేమతో నీ భర్త డొనాల్డ్ ట్రంప్ అని అందులో రాసుకొచ్చారు.






