Kim Jong Un :కిమ్ తెలివైనోడు.. ఆయనతో భేటీ అవుతా : ట్రంప్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un )తో త్వరలో భేటీ అవుతానని అమెరకా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వెల్లడిరచారు. గతంలో కూడా వీరిద్దరూ సమావేశమైన విషయం తెలిసిందే. ఇరు దేశాల చర్చలపై తాజాగా ట్రంప్ స్పందిస్తూ.. తప్పకుండా అతడికి (ఉన్) నేనంటే ఇష్టం అని వ్యాఖ్యానించారు. కిమ్ చాలా తెలివైన వ్యక్తి అని కొనయాడారు. దక్షిణ కొరియా(South Korea), అమెరికా(America) నుంచి ముప్పు పొంచి ఉందని ఉత్తర కొరియా (North Korea) ఇటీవల ఆరోపించిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.