ట్రంప్ ప్రభుత్వంలో మస్క్‌కు ఆ పదవి!
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నుంచి పూర్తి మద్దతు దక్కుతోంది. అదే సమయంలో తాను అధికారంలోకి వస్తే తన ప్రభుత్వంలో ఈ బిలియనీర్‌కు సముచిత స్థానం ఇస్తానని ట్రంప్ అంటున్నారు. ఇప్పటికే క్యాబినెట్లో చోటు కల్పిస్తానని, అలాకాకపోతే సలహాదారుడిగానైనా నియమిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అదే అంశం ప్రస్తావనకొచ్చింది. మస్క్ కోసం ట్రంప్ ఒక పదవిని ఫైనలైజ్ చేశారని తెలిసింది. ఫెడరల్ ఏజెన్సీల్లో ఆడిటింగ్ నిర్వహించేందుకు మస్క్‌తో సహా ఉన్నతస్థాయి వ్యాపార నిపుణులను చేర్చుకోవాలని ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ పెట్టుబడులను క్రమబద్ధీకరించి, వృథాను అరికట్టేలా వారి సేవలను వినియోగించుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పదవిపై మస్క్ ఆసక్తి ప్రదర్శించారు.






