జో బైడెన్ హెచ్చరిక
హమాస్ దాడుల్లో 22 మంది అమెరికన్లు మరణించారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. మరికొంతమంది గాజాలో బందీలుగా ఉన్నారని చెప్పారు. పశ్చిమాసియా ఘర్షణ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. హమాస్‌కు మద్దతుగా దాడులకు దిగవద్దని ఇరాన్‌తో పాటు లెబనాన్ లోని హెజ్బొల్లా మిలిటెంట్లను హెచ్చరించారు. అమెరికా నుంచి తొలి విడత ఆయుధ సామగ్రి ఇజ్రాయెల్ చేరుకుంది. కార్గో విమానంలో ఇవి వచ్చాయని పేర్కొంటూ ఇజ్రాయెల్ సైనం ఒక వీడియోను విడుదల చేసింది. బైడెన్ వ్యాఖ్యలపై హమాస్ స్పందించింది. అవి పక్షపాతంలో కూడుకున్న వ్యాఖ్యలని విమర్శించింది. ఇజ్రాయెల్ ఆక్రమణలను అడ్డుకోవడానికి పోరాడటం పాలస్తీనా వాసుల హక్కని స్పష్టం చేసింది.






