అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకపోతే.. నేనూ కూడా
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రచారం కోసం నిధులు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో బోస్టన్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ట్రంప్ మరోసారి పదవి కోసం పోటీలో లేకపోతే తాను కూడా పోటీ చేయకపోవచ్చని వ్యాఖ్యానించారు. ట్రంప్ పోటీలో లేకపోతే నేను పోటీ చేస్తానో లేదో కచ్చితంగా తెలియదు. కానీ ఈ దేశం కోసం ఆయన్ను మాత్రం గెలవనివ్వం అని అన్నారు. ప్రస్తుత, మాజీ అధ్యక్షులు అయిన బైడెన్, ట్రంప్ తాము ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే.






