జో బైడెన్ ఆరోగ్యం భేష్…అధ్యక్ష ఎన్నికల్లో పోటీ సై
వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జో బైడెన్ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారంటూ ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కెవిన్ సీఓ కానర్ వెల్లడించారు. వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో వార్షిక ఆరోగ్య పరీక్షలు ఆయనకు నిర్వహించారు. 80వ ఏటా తన విధులు నిర్వహిచడానికి అధ్యక్షుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా ఆయన పని చేయగలరు. హైపర్లిపిడేమియా, స్పైనల్ అర్థరైటీస్ వంటి కొన్ని వాటికి సాధారణ మందులు తీసుకుంటారు అని డాక్టర్ కెవిన్ తెలిపారు.






