చైనా అధ్యక్షుడికి జో బైడెన్ హెచ్చరిక!
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. చైనా ఆర్థిక వ్యవస్థ పాశ్చాత్య దేశాల పెట్టుబడులపై ఆధారపడి ఉందనే విషయం మర్చిపోకూడదని అన్నారు. ఈ సందర్భంగా బైడెన్ మీడియాతో మాట్లాడారు. రష్యా`ఉక్రెయిన్లోకి ప్రవేశించినప్పటి నుంచి 600 అమెరికన్ కంపెనీలు ఆ దేశం నుంచి వైదొలిగాయి. చైనా ఆర్థిక వ్యవస్థ యూరప్, అమెరికా నుంచి వచ్చే పెట్టుబడులపై ఆధారపడి ఉన్నట్లు మీరు (జిన్పింగ్) నాకు ఒక సందర్భంలో చెప్పారు. మరి అయితే జాగ్రత్తగా ఉండండి. ఇది బెదిరింపు కాదు. కేవలం పరిశీలన మాత్రమే అని అన్నారు.






