T20 World Cup: రెండేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్‌లు.. ఆ 10 మంది అరుదైన రికార్డు!
ఏ క్రికెటర్‌కైనా తన జీవితకాలంలో ఒక్కసారైనా ప్రపంచకప్ ట్రోఫీని (T20 World Cup) ముద్దాడటం ఒక కల. అలాంటిది కేవలం రెండేళ్ల వ్యవధిలో ఏకంగా రెండుసార్లు విశ్వవిజేతలుగా నిలిచే అదృష్టం వస్తే ఆ ఆనందానికి అవధులుండవు. సరిగ్గా ఇలాంటి అరుదైన ఘనతనే భారత జట్టులోని పది మంది స్టార్లు సొంతం చేసుకున్నారు. 2024లో అమెరికా-వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్న సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌లు.. తాజాగా 2026లో సొంతగడ్డపై మరోసారి కప్పును ఎత్తి మురిసిపోయారు.
నాడు క్యాచ్‌తో.. నేడు కెప్టెన్‌గా..
2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో భారత్‌కు కప్పును (T20 World Cup) అందించడంలో ఎంతటి కీలక పాత్ర పోషించిందో తెలిసిందే. అదే సూర్య ఇప్పుడు 2026లో ఏకంగా కెప్టెన్‌గా తన వ్యూహాలతో జట్టును ముందుండి నడిపించి ట్రోఫీ అందించాడు. లీగ్ దశలో అమెరికాపై (49 బంతుల్లో 84 రన్స్) కీలక ఇన్నింగ్స్ ఆడిన సూర్య.. బ్యాటర్‌గా కన్నా నాయకుడిగా తన మార్క్ చూపించాడు.
ఇవి కూడా చదవండి
మరోవైపు, పేస్ దళపతి జస్ప్రీత్ బుమ్రా తన మాయను కొనసాగించాడు. 2024లో 15 వికెట్లు పడగొట్టిన అతడు, 2026లోనూ 14 వికెట్లతో ఉమ్మడి అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో సెమీస్, న్యూజిలాండ్‌తో ఫైనల్లో బుమ్రా వేసిన మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ (T20 World Cup) అతని స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటాయి.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బెంచ్ నుంచి హీరోగా మారిన సంజూ..
2024 వరల్డ్ కప్‌లో (T20 World Cup) జట్టులో ఉన్నా తుది జట్టులో అవకాశం దక్కించుకోలేకపోయిన సంజూ శాంసన్.. ఈసారి మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని నూరు శాతం సద్వినియోగం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో సూపర్-8, ఇంగ్లండ్‌తో సెమీస్, న్యూజిలాండ్‌తో ఫైనల్.. ఇలా ప్రతి కీలక నాకౌట్ మ్యాచ్‌లో తన అసాధారణ ఇన్నింగ్స్‌లతో జట్టుకు వెన్నెముకగా నిలిచాడు.
హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే త్రయం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. దూబే సెమీస్‌లో 43, ఫైనల్లో 26 పరుగులతో (నాటౌట్) విధ్వంసం సృష్టించి ఫైనల్లో భారత్ స్కోరును 250కి చేర్చాడు. అక్షర్, పాండ్యాలు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ, మెరుపు ఫీల్డింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేశారు. సెమీస్‌లో అక్షర్ పట్టిన క్యాచ్‌లు మ్యాచ్‌ను (T20 World Cup) మలుపుతిప్పాయి. ఇక కుల్దీప్ యాదవ్ (పాకిస్థాన్‌పై), సిరాజ్ (అమెరికాపై) తమకు దక్కిన తక్కువ అవకాశాల్లోనే అద్భుతంగా రాణించి విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు.
ఇవి కూడా చదవండి








