Sunrisers: పాక్ క్రికెటర్‌ను కొన్న సన్‌రైజర్స్.. కావ్య మారన్‌పై ఫ్యాన్స్ ఫైర్!
ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ‘ది హండ్రెడ్’ (The Hundred) లీగ్ వేలంలో సన్‌రైజర్స్ (Sunrisers) యాజమాన్యం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యజమానులకే చెందిన ‘సన్‌రైజర్స్ లీడ్స్’ జట్టు.. పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను వేలంలో భారీ ధరకు కొనుగోలు చేయడం నెట్టింట దుమారానికి దారితీసింది.
భారత ఫ్రాంచైజీ షాకింగ్ నిర్ణయం..
గురువారం జరిగిన ఈ వేలంలో స్వయంగా పాల్గొన్న సన్‌రైజర్స్ (Sunrisers) సీఈఓ కావ్య మారన్.. ట్రెంట్ రాకెట్స్ ఫ్రాంచైజీతో తీవ్రంగా పోటీపడి మరీ అబ్రార్ అహ్మద్‌ను రూ.2.34 కోట్లకు దక్కించుకున్నారు. 2009లో ఐపీఎల్లో పాకిస్థాన్ ఆటగాళ్లపై నిషేధం విధించిన తర్వాత.. ఒక భారతీయ యాజమాన్యానికి చెందిన క్రికెట్ ఫ్రాంచైజీ, పాక్ క్రికెటర్‌తో అధికారికంగా ఒప్పందం చేసుకోవడం గత 17 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అభిమానుల ఆగ్రహం..
అబ్రార్ అహ్మద్‌ను కేవలం పాకిస్థాన్ ఆటగాడు అన్న కోణంలోనే కాకుండా, అతని వివాదాస్పద గతాన్ని గుర్తుచేస్తూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గతంలో భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindhoor) సమయంలో.. అబ్రార్ అహ్మద్ భారతదేశాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో అత్యంత అభ్యంతరకరమైన పోస్టులు చేశాడు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దేశాన్ని అంతలా అవమానించిన ఒక వ్యక్తికి, కోట్ల రూపాయలు ఇచ్చి తమ (Sunrisers) జట్టులోకి ఎలా ఆహ్వానిస్తారంటూ కావ్య మారన్ తీరుపై సోషల్ మీడియా వేదికగా భారతీయ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జాతీయ భావాల కంటే వ్యాపారమే ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నారు.
అమ్ముడుపోని పాక్ స్టార్లు..
కాగా, ఈ వేలంలో మొత్తం 13 మంది పాకిస్థాన్ ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో మరో మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను బర్మింగ్‌హామ్ జట్టు దక్కించుకుంది. అయితే పాక్ స్టార్ ఆటగాళ్లు హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్‌లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా కనీస ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి








