సన్‍రైజర్స్ హైదరాబాద్ భారీ విరాళం

కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరులో భాగంగా సన్‍రైజర్స్ హైదరాబాద్ భారీ విరాళం ప్రకటించింది. కొవిడ్ కట్టడికి తన వంతు సాయంగా రూ.30 కోట్లను కోవిడ్ రిలీఫ్ ఫండ్‍కు అందజేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. కరోనా సెకండ్‍వేవ్ కారణంగా ప్రభావితమైన బాధితులకు అండగా ఉండేందుకు సన్ టీవీ నెట్‍వర్క్ రూ.30 కోట్లను విరాళంగా ఇస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు ఈ నిధులను వెచ్చించానున్నాం. ఆక్సీజన్ సిలిండర్లు, మెడిసిన్ సరఫరా నిమిత్తం ఎన్జీఓలతో భాగస్వామ్యమై ముందుకు సాగుతాం. అంతేకాదు మీడియా ద్వారా కరోనా వ్యాప్తి అడ్డుకట్టకై తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం అని పేర్కొంది.