ఈసారి ట్యాంక్ బండ్ మీద కాదు.. ప్రగతి భవన్ లో
కేసీఆర్ ప్రభుత్వం నిబంధనల పేరుతో హిందువుల పండగలను అడ్డుకొనే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడుతూ దీన్ని హిందూ సమాజం గమనించాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏటా వినాయక నిమజ్జనం ఉత్కంఠ వాతావరణంలో జరుపుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్లో నిమజ్ఞనం చేయాలంటే అనేక పర్మిషన్స్ తీసుకోవాలి. హిందువుల పండుగ అంటే పీస్ కమిటీ మీటింగ్ పెడతారు. మూడు రోజుల్లో నిమజ్జనం ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఏర్పాట్లు చేయలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల పేరుతో నిమజ్ఞనం అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ సారి ట్యాంక్ బండ్ మీద కాదు, ప్రగతి భవన్లో జరుగుతాయని హెచ్చరించారు. సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు కూడా పట్టించుకోలేదు. కోవిడ్ సమయంలో రంజాన్ పండుగను పాత బస్తీలో నిర్వహించారు. మేము ఎక్కడ దానికి అడ్డు చెప్పలేదన్నారు.













