దుబ్బాక అసెంబ్లీ బరిలో రాములమ్మ ?
డిసెంబర్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ బరిలో మెదక్ మాజీ ఎంపీ, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి పోటీ చేస్తున్నట్లు విశ్వనీయ వర్గాల ద్వారా సమాచారం. దుబ్బాక అసెంబ్లీలో పోటీ చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచనలమేరకే విజయశాంతి దుబ్బాక అసెంబ్లీ నుండి పోటీలో దిగనున్నారని తెలిసింది. మహాకూటమి అభ్యర్థి స్థానంలో పోటీ చేయనున్నారు. గత కొద్ది కాలంగా విజయశాంతి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అసెంబ్లీ స్థానానికి పోటీ చేయనని చెప్పిన రాములమ్మ కాంగ్రెస్ కార్యకర్తల ఒత్తిడితో నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మెదక్ అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పొందిన విషయం విదితమే. అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని అమె నిర్ణయం తీసుకున్నా పార్టీ అధిష్టానం సూచన మేరకు లోక్సభకు కాకుండా అసెంబ్లీకి పోటికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.













