104 సీట్లు కాదు.. ఆయనకు 104 జ్వరం వస్తుంది
తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచారంలో దూసుకుపోతున్న అధికార, ప్రతిపక్షపార్టీల నేతలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్పై వ్యంగ్య బాణాలు సంధించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్కు వంద సీట్లు రావడం కాదు, ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్కు 104 జ్వరం వస్తుందని వ్యాఖ్యానించారు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా భాగస్వామ్య పార్టీలు గెలిచేందుకు స్థానాలను అడగాలి తప్ప కాంగ్రెస్ గెలిచే స్థానాలను అడగొద్దని అన్నారు.













