భారత్, అమెరికా కలిసి పని చేస్తే .. ప్రపంచానికి మేలు : ఉపరాష్ట్రపతి
భారత్, అమెరికా వైద్యరంగంలో సమన్వయంతో పని చేస్తే ప్రపంచానికి మేలు జరుగుతుందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయడు అన్నారు. హైదరాబాద్లో ప్రారంభమైన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిస్ (ఏఏపీఐ) 15వ అంతర్జాతీయ సదస్సును ఉద్ధేశించి వర్చువల్ పద్దతిలో ఆయన ప్రసంగించారు. అమెరికా అధారిత సంస్థలు, భారతదేశ సంస్థలు పరస్పర సమన్వయంతో ఇటీవల కొర్బేవాక్స్, కోవోవాక్స్ టీకాలను రూపొందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో ప్రగతిని సాధించిన టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను విస్తరించేందుకు టెలిమెడిసిన్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో నమోదు చేసుకోవడం ద్వారా వ్యాధి గ్రస్తుల సంపూర్ణ వివరాలు ఒకచోట అందుబాటులోకి వస్తాయనీ, అపుడు సరైన వైద్యం అందించేందుకు వీలవుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు.













