టీఆర్ఎస్ కు భారీ విరాళాలు
టీఆర్ఎస్ 17వ ప్లీనరీ కొంపల్లిలోని బీబీఆర్ గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా పార్టీ నేతలు తమకు తోచినంతా విరాళాలు ప్రకటించారు. పలువురు నాయకులు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి రూ.20 కోట్ల 41 లక్షల విరాళాలు ఇచ్చారు. విరాళాలను సీఎం కేసీఆర్ చదివి వినిపించారు. అంతకుముందు పార్టీ ఫండ్ రూ.21 కోట్ల 67 లక్షలు ఉంది. మొత్తం కలిపి రూ.42 కోట్ల 8 లక్షల రూపాయాలు అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వివరాలన్నింటినీ త్వరలోనే ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సమర్పిస్తామని ముఖ్యమంత్రి సృష్టం చేశారు.













