సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కరోనా పరీక్షల అంశంలో హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కరోనా పరీక్షల విషయంలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించలేదని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడికి హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కరోనా కట్టడికి అవసరమైనన్ని పరీక్షలు చేస్తుందని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రోజూ 50 వేల పరీక్షల నిర్వహణ కష్టమని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం చెప్పిన సమాధానంతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై స్టే ఇచ్చింది.













