తెలంగాణ రైతులకు శుభవార్త
తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 2018 డిసెంబరు 11వ తేదీలోగా తీసుకున్న రైతు రుణాలు రూ.లక్ష వరకూ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ బడ్జెట్లో వ్యవసాయాభివృద్ది కోసం రూ.20,107 కోట్లు కేటాయించారు. రైతు బంధు సాయం కింద ఎకరానికి రూ.10 వేలు అందిస్తుండగా, ఇందుకోసం రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతు బీమా కోసం రూ.650 కోట్లు కేటాయించిన కేసీఆర్ ప్రభుత్వం.. నీటిపారుదల శాఖకు రూ.22,500 కోట్లు కేటాయించింది.













