బంగారు తెలంగాణ కోసం మరో ఉద్యమం
బంగారు తెలంగాణ కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు. బీజేపీ నిరుద్యోగ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారు తెలంగాణ కోసం దీక్ష చేస్తోన్న బండి సంజయ్కు మద్దతుగా నిలవాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అరెస్టులు చేసినా పెద్ద ఎత్తున కార్యకర్తలు దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారని తెలిపారు. తెలంగాణ కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ చెప్పారని, ఉద్యోగాలు వచ్చాయా? అని నిలదీశారు. కేసీఆర్ ఇంట్లో వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.













