హైదరాబాద్ లో ఘనంగా శ్రీవారి వైభవోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం గోవింద నామస్మరణతో మార్మోగింది. శ్రీవేంకట్వేర వైభవోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఈ ప్రాంతం తిరుమలను తలపించింది. తిరుమల ఆలయంలో రోజువారీగా నిర్వహించే సేవలను అన్ని ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టీటీడీ ఈ వైభవోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సుప్రభాత సేవ, తోమాలసేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర, అష్టదళ పాదపద్మరాధన, రెండవ నివేదన, వసంతోత్సవం, వీధి ఉత్సవం, సర్వదర్శనం, సహస్రదీపాలంకరణ సేవ, రాత్రి కైంకర్యం, ఏకాంత సేవకు వేల మంది భక్తులు హాజరయ్యారు. వారపుసేవలో భాగంగా వసంతోత్సవం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హాజరై నమూనా ఆలయంలో శ్రీవారిని దర్శించుకుని వివిధ సేవల్లో పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సతీమణి ఉష, ఎంపీ కే లక్ష్మణ్ తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.













