‘గ్లోబల్ సిటీ ఆఫ్ హైదరాబాద్’పై రౌండ్ టేబుల్ సమావేశం
జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అలూమ్నీ అసోసియేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా భాగస్వామ్యంలో కీలక సమావేశం జరిగింది. హైదరాబాద్‌ను భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయడంపై ఈ సమావేశం నిర్వహించారు. ‘గ్లోబల్ సిటీ ఆఫ్ హైదరాబాద్ – మెట్రోపాలిటన్ ఫ్యూచర్స్ – ఎ ప్లానింగ్ ఎక్సిజెన్సీ’ పేరిట జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పేరొందిన ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు. వీళ్లంతా అర్బన్ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఎన్నో విజయాలు సాధించిన వాళ్లే కావడం గమనార్హం.
భవిష్యత్తులో హైదరాబాద్‌ను మరింత అందమైన, ఆనందమైన, గ్లోబల్ సిటీగా మార్చడానికి చేపట్టాల్సిన చర్యలపై ఇక్కడ చర్చ జరిగింది. దీనికోసం హ్యాపీనెస్ ఇండెక్స్, ఇంక్లూజివ్ జీడీపీ వంటి గణాంకాలను కూడా పరిశీలించారు. హుడా, ఎంసీహెచ్, సీఈడీఏ, హెచ్ఎండీఏ తదితర ఏజెన్సీలు ప్రతిపాదించిన ప్లాన్లపై కూడా ఈ రౌండర్ టేబుల్ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, నిపుణుల సూచనలను తెలంగాణ ప్రభుత్వంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ విభాగాలకు చేరవేస్తామని నిర్వాహకులు తెలిపారు.













