తెలంగాణలో ఎన్నికల్లో పవన్.. అక్కడి నుంచే ప్రచారం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. ఆ పార్టీ అభ్యర్థులతో పాటు కూటమిలో ఉన్న బీజేపీ అభ్యర్థుల తరపున పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్‌కు మద్దతుగా, 26న కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అలాగే తెలంగాణలో ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభల్లోనూ అధికారికంగా పవన్ హాజరు కానున్నారు.













