ఈ నెల 17న పాస్‌పోర్ట్ ప్రత్యేక డ్రైవ్
ఈ నెల 17న ప్రత్యేక పాస్‌పోర్ట్ డ్రైవ్ కొనసాగుతుందని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా హైదరాబాద్ (అమీర్‌పేట, బేగంపేట్, టౌలిచౌకీ) కరీంనగర్, నిజామాబాద్‌లోని పాస్‌పోర్ట్ కేంద్రాల్లో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తత్కాల్, సాధారణ క్యాటగిరీల కింద పాస్‌పోర్ట్ దరఖాస్తులను ప్రాసెస్ చేస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు తమ అపాయింట్మెంట్ రీ షెడ్యూల్ ప్రక్రియ కోసం బ్రోకర్లను ఆశ్రయించొద్దని కోరారు. గత స్పెషల్ డ్రైవ్‌లలో ముగ్గురు బ్రోకర్లను పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.













