మరో 4 వారాలు పాస్‌పోర్టు ప్రత్యేక డ్రైవ్
పాస్‌పోర్టు కోసం దరఖాస్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మరో 4 శనివారాలు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని విదేశాంగ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 5న నిర్వహించే డ్రైవ్‌కు సంబంధించి ఇప్పటికే అపాయింట్మెంట్లు మంజూరవగా, 12వ తేదీతో పాటు వరుసగా మరో మూడు వారాలు డ్రైవ్ కొనసాగుతుందని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అయిదు పాస్‌పోర్టు సేవాకేంద్రాలు, 14 పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవాకేంద్రాల్లో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆగస్టు 12న నిర్వహించే డ్రైవ్ సంబంధిత అపాయింట్మెంట్లు శుక్రవారం సాయంత్రం 4:30 గంటల నుంచి వైబెసైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. 4 వారాల్లో మొత్తం 15వేల దరఖాస్తులు ప్రాసెస్ చేయనున్నారు.













