ప్రధాని మోడీ మరో రికార్డు
ప్రపంచ ఆధునిక హంగులతో, అద్భుత ప్రతిభతో, ఇంజనీరింగ్ ఛాలెంజ్లతో అత్యాధునికంగా నిర్మాణమవుతున్న హైదరాబాద్ మెట్రోరైలు త్వరలో హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి రానున్నది. ఈ నెల 28వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న హైదరాబాద్ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైలు కావడం విశేషం. దేశంలో తొలి మెట్రోరైలు కూత 1984 అక్టోబరు 24వ తేదీ కోల్కతాలో ప్రారంభం కావడం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించడం జరిగింది. అప్పటినుండి దేశంలో 9 మెట్రో రైలు స్టేషన్లు ప్రారంభించారు. అయితే ఇప్పటివరకూ ఏ ప్రధాని రెండు మెట్రో రైలుస్టేషన్లను ప్రారంభించిన దాఖలాలు లేవు. ఆ అరుదైన గౌరవం కూడా ప్రధాని మోదీ ఖాతాలో పడనున్నది.













