సిరిసిల్ల నేతన్నకు ప్రధాని మోదీ ప్రశంస
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మన్‌కీ బాత్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. హరిప్రసాద్ తన చేనేత మగ్గంపై మూడు రోజులు శ్రమించి వస్త్రంపై జీ`20 చిహ్నం తయారు చేసి పంపారని, ఈ అద్భుతమైన బహుమతిని చూసి తాను ముగ్ధుడినయ్యానని ప్రధాని పేర్కొన్నారు. హరిప్రసాద్ కళా నైపుణ్యం అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో ఉందని కితాబునిచ్చారు. చేతితో నేసిన జీ-20 లోగోతో పాటు ఓ లేఖను హరిప్రసాద్ తనకు పంపారని, వచ్చే ఏడాది జరగనున్న జీ`20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండటం గర్వించదగ్గ విషయమని అందులో రాశరని వెల్లడిరచారు. ఆయనలా అందరూ ఏదో ఒకరకంగా జీ`20తో అనుసంధానం కావాలని ప్రధాని కోరారు.













