నీ కమ్యూనిజం బీజేపీ నేతల వద్ద తాకట్టు పెట్టావా?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై టీఆర్‍ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈటల నీ కమ్యూనిజం ఇప్పుడు ఎక్కడ పోయింది, బీజేపీ నేతల దగ్గర తాకట్టు పెట్టావా? అని ప్రశ్నించారు. ఇవాళ ఈటలను అందరూ ఛీ కొడుతున్నారు. ఒక మంత్రిగా ఈటల చట్ట విరుద్ధమైన పనలు చేశారు. ప్రభుత్వ భూములు ఎలా తీసుకున్నావు? నీ ఆత్మగౌరవం ఎక్కడ ఉంది? రాజకీయంగా ఆయన సమాధి ఆయనే కట్టుకుంటున్నారు అని పేర్కొన్నారు. 20 ఏళ్లలో సీఎం కేసీఆర్ ఎందరో నేతలను తయారు చేశారు. కానీ నిన్ను గౌరవించినట్లు కేసీఆర్ ఇంకెవరినీ గౌరవించలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ పదవులు మీరే అనుభవించారు. పార్టీ నాయకత్వంపై, నేతలను కించపర్చే విధంగా మాట్లాడటం సరికాదు. ఈటల క్షమించారని నేరం చేశారు. ఈటలపై సీఎం కేసీఆర్ సరియైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు అని అన్నారు.