కేంద్రం వద్ద బీఆర్ఎస్ సర్కారు ఎందుకు మోకరిల్లింది? : మంత్రి జూపల్లి
నదీ జలాల విషయంలో గత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నీటి సమస్యలు పరిష్కరించకుండా కేంద్రానికి ఎందుకు మద్దతు తెలిపారని నిలదీశారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? కేంద్రం వద్ద బీఆర్ఎస్ సర్కారు ఎందుకు మోకరిల్లింది? పదేళ్లపాటు బీఆర్ఎస్ సర్కారు న్యాయమైన తెలంగాణ వాటా సాధించలేకపోయింది. ఆ పార్టీ నేతలు తాము చేసిన తప్పులను అంగీకరించకుండా బుకాయిస్తున్నారు.
సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరగలేదని హరీశ్‌రావు చెప్పగలరా? ప్రాజెక్టుల్లో రూ.వేల కోట్ల అవినీతి జరిగింది. దీనిపై నేను ఆధారాలు చూపిస్తా. అప్పట్లో విద్యాసాగర్‌రావు సాగునీటి మంత్రి అయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. కేసీఆర్‌కు చంద్రబాబు రాజకీయంగా సరిపడదు. ఆయన రెండోసారి సీఎం కాకూడదని కేసీఆర్ భావించారు. జగన్‌కు రాజకీయ లబ్ధి కలగాలనే కేసీఆర్ సహకరించారు. రాయలసీమ ఎత్తిపోతలకూ మద్దతిచ్చారు అని తెలిపారు.













