బీజేపీ ప్రభుత్వంలో అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్
హుజూరాబాద్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. హుజూరాబాద్ నియోజకర్గంలోని వీణవంక మండలంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ బీజేపీ ప్రభత్వుంలో అచ్చేదిన్ కాదు సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ అమ్మకానికి రూపమైతే టీఆర్ఎస్ నమ్మకానికి రూపమని పేర్కొన్నారు. రైళ్లు, రోడ్లు అమ్మితే సామాన్య ప్రజల పరిస్థితి ఏం•ని నిలదీశారు. ప్రజలు బాగుపడాలా? ఈటల రాజేందర్ బాగుపడాలా? ఆలోచించాలని ప్రజలకు సూచించారు. నీ సహకారంతో గెలు శ్రీనును, గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామన్నారు..
వీణవంకలో 2-3 రోజుల్లో 24/7 పనిచేసేలా ఆస్పత్రి, పోస్ట్ మార్టం కేంద్రం మంజూరుకు కృషి చేస్తామన్నారు. బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, వివేక్, సంజయ్ ఇక్కడి వాళ్లా అసహనంతో ఈటెల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. చావు నోట్లో తలపెట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం పూర్తవుతదా అన్నారు. రైతులు వద్దనే రీతిలో నీళ్లు వస్తున్నాయి. నీటి తీరువా రద్దు చేసింది టీఆర్ఎస్ ప్రభుతవం అని తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు బంధు ఇస్తుంటే కేంద్రం ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు.













