ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో గెలిచేది మేమే
కర్ణాటకలో అధికారపార్టీ అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణకు చేరవేస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికల్లో డబ్బు పంచి గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితుడైన అంబికా పతి, ఆయన భార్య అశ్వత్త ఇంట్లో రూ.52 కోట్లు పట్టుపడ్డాయన్నారు. కర్ణాటలో గతంలో అధికారంలో బీజేపీ కాంట్రాక్టర్ల దగ్గర 40 శాతం కమీషన్ వసూలు చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ 50 శాతం వసూలు చేస్తోందని ఆరోపించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ స్కాంగ్రెస్‌గా మారిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎన్ని నోట్ల కట్టలు పంచినా, ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో గెలిచేది (బీఆర్ఎస్) మేమే అని అన్నారు. తెలంగాణలో టికెట్ అమ్ముకొంటున్నట్టు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని ఎద్దేవా చేశారు.













