తెలంగాణలో మరో భారీ పెట్టుబడి… రూ.750 కోట్లతో

బంగారు ఆభరణాల సంస్థ మలబార్ తెలంగాణలో రానున్న మూడేళ్లలో రూ.750 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్, ఇతర ప్రతినిధులు సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మలబార్ సంస్థ మహేశ్వరంలో ఏర్పాటు చేసిన బంగారం, వజ్రాభరణాల తయారీ యూనిట్ దేశంలోనే అతిపెద్దది. ఈ కేంద్రంపై ఇప్పటికే మలబార్ రూ.183 కోట్ల పెట్టుబడులు పెట్టింది. మూడేళ్లలో మొత్తం రూ.750 కోట్లు వెచ్చిస్తుంది. ఏడాది చివరి నాటికి 1,500 మంది ఉద్యోగులతో ఆభరణాల తయారీ ప్రారంభమవుతుంది. పరోక్షంగా మరో 1,250 మందికి ఉపాధి దొరుకుతుంది అని తెలిపారు.మహేశ్వరం యూనిట్‌కు ప్రత్యేకంగా తాగునీటి పైప్ లైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.