Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కదు : మహేశ్ కుమార్ గౌడ్
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మతం పేరుతో రెచ్చగొట్టి లబ్ధిపొందే ప్రయత్నం చేస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్(Nitin Nabeen) రాక అందులో భాగమే అని ఆరోపించారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ ఒరిగిందో చెప్పాలని నితిన్ నబీన్‌ను డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాలను, నిధులను ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయడం లేదు. జీడీపీలో తెలంగాణ వాటా 5.01 శాతం. ఆ లెక్కన కేంద్రం నుంచి తెంగాణకు దక్కాల్సిన వాటా రావడం లేదు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో జరిగిన జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్ రాలేదన్న విషయాన్ని నితిన్ నబీన్ తెలుసుకోవాలి. అభివద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తు కాంగ్రెస్‌కు ఓటేసి మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలి అని రాష్ట్ర ప్రజలకు విన్నవించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడా కాంగ్రెస్ రెబల్స్ బరిలో లేరు. బీసీలకు 50 శాతానికి పైగా బీ ఫాంలు ఇచ్చాం అని తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






