విపక్షాలతో చేతులు కలిపిన ఈటల… పార్టీకి
టీఆర్ఎస్లో ఉంటూనే పార్టీని కూల్చే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ విఫలం అయ్యారని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. ఈటల వ్యవహారంలో యూఎస్ఏ ఎన్నారై కోర్ కమిటీ సభ్యులతో పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మహేశ్ బిగాల మాట్లాడుతూతూ ఈటల టీఆర్ఎస్లో ఉంటూ విపక్షాలతో చేతులు కలిపి పార్టీకి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాను జయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహేశ్ శుభాకాంక్షలు తెలిపారు. సమీక్షలో పార్టీ ఎన్నారై కోర్ కమిటీ సభ్యులు మహేశ్ తన్నీరు, శ్రీనివాస్ గనుగోని, వెంజల్ జలగం,చందు తాళ్ల, రిషికేశ్‌రెడ్డి, వెంకట్‌గౌడ్, పూర్ణ బైరి, భాస్కర్ పిన్న, మహేశ్ పొగాకు పాల్గొన్నారు.













