కూచిపూడి నాట్యాచార్యులకు డాక్టరేట్ ప్రదానం
ముప్పై ఏళ్లకుపైగా కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తున్న నాట్యాచార్యులు వేదాంతం పార్థసారథి, కళారత్న మహంకాళి సూర్యనారాయణశర్మకు గౌరవ డాక్టరేట్ లభించింది. కాలిఫోర్నియాకు చెందిన యునైటెడ్ ఫిజియోలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కడపల్లిలో త్యాగరాజగాన సభ జరిగింది. ఈ సభలో మాజీ గవర్నర్ రోశయయ చేతుల మీదుగా వారు గౌరవ డాక్టరేట్ అందుకున్నారని కూడిపూడి కళాపీఠం ప్రిన్సిపాల్ వేదాంతం రామలింగశాస్త్రి తెలిపారు. వివిధ రంగాలలో నిష్టాతులైన వారికి అందించే సత్కారాలలో భాగంగా పార్థసారథి, సూర్య నారాయణశర్మకు డాక్టరేట్ లభించడంపై కూచిపూడి కళా కుటుంబం అభినందనలు తెలియజేసింది.













