ఐటీ కంపెనీలపై దృష్టి సారించి సురక్షితమైన రిమోట్ కో–వర్కింగ్ స్పేసెస్ను ‘ఆఫీస్ బబుల్స్’ శీర్షికన అందిస్తున్న ఎల్ & టీ మెట్రో రైల్
హైదరాబాద్ మెట్రో రైల్ ను నిర్వహిస్తోన్న ఎల్ & టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (ఎల్&టీ ఎంఆర్హెచ్ఎల్) వినూత్న నేపథ్యం ‘ఆఫీస్ బబుల్స్’ను ప్రారంభించింది. ఇది సురక్షితమైన, రిమోట్, కో–వర్కింగ్ ప్రాంగణాలను తమ ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్ (టీఓడీ)లో భాగంగా అందిస్తుంది. భారతీయ మెట్రోరైల్ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి. ఈ ఆఫీస్ బబుల్స్ ద్వారా ఎల్ –టీఎంఆర్హెచ్ఎల్ ఇప్పుడు నగరంలో వృద్ధి చెందుతున్న కో–వర్కింగ్ ప్రాంగణాల డిమాండ్ తీర్చడంతో పాటుగా హైదరాబాద్లో ఆఫీస్ ప్రాంగణాలకు లొకేషన్ ఫ్లెక్సిబిలిటీ సైతం అందిస్తుంది.
హైదరాబాద్ మెట్రో రైల్కు చెందిన ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్ అత్యున్నత నాణ్యత కలిగిన రవాణా వ్యవస్ధతో పాటుగా ఆహ్లాదకరమైన అర్బన్ ప్రాంగణాలను సృష్టిస్తున్నాయి. ఈ టీఓడీ దాదాపు 18.5 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ ప్రాంగణాన్ని వర్క్, షాపింగ్, విశ్రాంత, వినోద, ఆరోగ్య సంరక్షణ అవసరాలను పార్కింగ్, సర్క్యులేషన్ ప్రాంతంతో అందిస్తుంది.
ఐటీ కంపెనీలపై దృష్టి సారించి ఆఫీస్ బబుల్స్ సృష్టించారు. ఇది హబ్ అండ్ స్పోక్ నమూనాలో ఉంటుంది. నగరంలో దాదాపు 0.4 మిలియన్ చదరపు అడుగుల ప్రాంగణాన్ని ఆఫీస్ బబుల్స్కు లీజ్ కోసం కేటాయించారు. క్లయింట్స్ అవసరాలకనుగుణంగా ప్లగ్ అండ్ ప్లే, బేర్ షెల్, వార్మ్ షెల్ రూపంలో వీటిని అందిస్తున్నారు.
ఎల్& టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ ఎండీ అండ్ సీఈఓ శ్రీ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ ‘‘ భారతీయ నగర రవాణా రంగంలో మొట్టమొదటిసారిగా ఆఫీస్బబుల్స్ను అందిస్తుండటం గర్వకారణంగా ఉంది. అత్యున్నతంగా అనుసంధానించబడి ఉండటంతో పాటుగా సురక్షితంగా ఉంటూనే ఆధారపడతగిన రిమోట్ కో వర్కింగ్ ప్రాంగణాలు కోరుకునే కార్పోరేట్స్ సహాయపడే రీతిలో ఈ ఆఫీస్ బబుల్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ సహజసిద్ధంగా ఉండటం మాత్రమే కాదు స్టార్టప్స్కు లాజికల్ ఎంపికగా కూడా నిలుస్తుంది. అలాగే ఇది అందించే సౌకర్యం పరంగా కో–వర్కింగ్ స్పేసెస్ వైపు వెళ్లాలనుకునే కార్పోరేట్ సంస్ధలకు సైతం ఉపయుక్తంగా ఉంటుంది’’ అని అన్నారు.













