నల్గొండ ఎంపీగా పోటీ చేస్తా
నల్గొండ ఎంపీగా పోటీచేస్తానని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల అభినందన సభలో కోమటిరెడ్డి పాల్గొని మాట్లాడారు. నల్గొండ నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత మీదేనని సూచించారు. సర్పంచ్‌గా ఓడిపోయిన వారు మనోధైర్యం కోల్పోవద్దన్నారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ గ్రామజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టి నిధులు మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాకుండా కేంద్రం నుంచి గ్రామాలకు వచ్చే నిధులను కూడా పక్కదోవ పట్టించారని విమర్శించారు. ఈసారైనా ప్రభుత్వం నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి చేయాలని విజ్జప్తి చేశారు.













